ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది… వరుసగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులకు కూడా కరోనా సోకుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు పొలిటికల్ లీడర్లు, అధికారులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కోవిడ్ సోకింది.. ట్విట్టర్ ద్వారా స్వయంగా ఈ విషయాన్ని నారా లోకేష్ వెల్లడించారు.. తనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ లక్షణాలు లేకున్నా.. పాజిటివ్‌గా వచ్చిందన్నారు.. తాను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ట్విట్టర్లో వెల్లడించిన…
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సందర్భంగా స్కూళ్లకు సెలవులు పొడిగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు తాను లేఖ రాశానని లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయని ఏపీ ప్రభుత్వానికి లోకేష్ గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయని లోకేష్ వివరించారు. Read Also: విద్యార్థులకు అలర్ట్..…
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చంద్రయ్య అనే వ్యక్తిపై నిన్న రాత్రి కత్తులతో, కర్రలతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యచేశారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందిని ఆయన ఆరోపించారు.…
వివేకానంద జయంతిని పురస్కరించుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివేకానందకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానన్నారు. జాతీయ యువజనోత్సవ దినం సందర్భంగా లోకేష్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరమన్నారు వివేకానంద, ఏపీలో యువత నిరాశ, నిస్పృహలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ సారి లేఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రస్తావించారు.. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని లేఖలో కోరిన ఆయన.. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని కోరిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించి రూ. 10 లక్షల ప్యాకేజీ…
ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం. దీంతో టీడీపీ అధినేత దీక్షలు చేపట్టడం.. అనంతరం పట్టాభి అరెస్ట్, అసెంబ్లీ సమావేశాల ఘటన ఇలా ఒక్కో ఘటనకు ఏపీ రాజకీయాలు అతిథ్యమిచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల నారా భువనేశ్వరి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుఫున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనసేన కార్యాలయానికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం నాడు గుంటూరు జిల్లా కుంచనపల్లిలో పర్యటించిన నారా లోకేష్… అనూహ్యంగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జనసేన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. కుంచన పల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. Read Also: వెంకయ్య మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న…
సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోంది అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 15 ఏళ్ళ నుంచి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్బిసి మూతపడటం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర…
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై శనివారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. కోస్గి మండలం పెద్దభూంపల్లిలో రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. Read Also: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలో చర్చ అయితే టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరగడంపై టీడీపీ జాతీయ…
సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని లేఖలో పేర్కొన్నారు నారా లోకేశ్. గిరిజనులకు నిలిపివేసిన పెన్షన్, రేషన్‌ను పునుద్దరించాలని కోరారు. 10 ఎకరాల భూమి, వాహనం ఉంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనలు ఆదివాసీల పాలిట శాపంగా మారాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఏడాది ఆదాయం 25 వేలు కూడా ఉండదన్నారు. గిరిజనులకు పథకాలను…