ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు, ఇతర సమస్యలపై సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది… మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సూపర్‌స్టార్ మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం వైఎస్ జగన్‌ను కలవడం.. సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలపడం జరిగిపోయాయి.. ఇక, త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా చిరంజీవి ప్రకటించారు.. కానీ, ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు.. ఇదే సమయంలో.. జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల కావడం.. బెనిఫిట్ షోలకు అనుమతి లేదని సర్కార్ తేల్చేయడంపై ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.. పవన్ ఫ్యాన్స్ కొన్ని థియేటర్ల దగ్గర ఆందోళనకు కూడా దిగగా.. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
Read Also: Brother Anil Kumar: ఉండవల్లితో సుదీర్ఘ భేటీ.. రహస్య విషయాలపై చర్చ!
భీమ్లా నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు నారా లోకేష్.. తాను భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానని వెల్లడించిన ఆయన.. ఇదే సమయంలో సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు.. జగన్ రెడ్డి ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేయటం ద్వారా రాష్ట్రాన్ని భిక్షాటన చిప్పగా మార్చాలనుకుంటున్నారని మండిపడ్డారు నారా లోకేష్… సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదన్న ఆయన.. భీమ్లా నాయక్ అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.