తెలుగుదేశం పార్టీని తూర్పుగోదావరి జిల్లాలో పటిష్టం చేసే పనిలో పడ్డారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో టీ డీ పీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. జిల్లాలో సభ్యత్వం సరిగా చేయడం లేదని మీడియా లో వచ్చిన వార్తలు తో లోకేష్ వివరణ అడిగారు. లోకేష్ అలా అడిగి ఉండకూడదు, జిల్లాల పార్టీ సభ్యత్వం బాగా జరుగుతుంది. వైసీపీ నుండి బయటకు వచ్చినప్పుడు జగన్ కి చెప్పి బయటకు వచ్చాం.
Read Also: Jyothula Naveen: పార్టీ కోసమే పనిచేస్తున్నా… కమిట్మెంట్ తో వున్నా
పార్టీ మారే పరిస్థితి 99 శాతం లేదు, ఆ ఒక్క శాతం కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. అవసరాల అవకాశాల కోసం జ్యోతుల నెహ్రు తల వంచడు..రాష్ట్రం లో ఎవరు ముందుకు రానప్పుడు నేను ముందుకు వచ్చి పార్టీ కోసం పని చేస్తున్నాను. పార్టీ కార్యక్రమాలు చాలా ఎఫెక్ట్ పెట్టి పని చేస్తున్నా అన్నారు జ్యోతుల నవీన్. పార్టీ మారే ఓపిక లేదు,ఏ పార్టీ లో ఉన్న కమిట్మెంట్ తో పని చేస్తాను. శ్రీ కాకుళంలో లోకేష్ ని అరెస్ట్ చేయడం దారుణం,దుర్మార్గం. త్వరలోనే ప్రభుత్వానికి గుణ పాఠం చెబుతాం అన్నారు నవీన్. సంక్షేమ పథకాలు పొందిన వారు ఎవరు ఆనందంగా లేరు. ప్రజలు కష్టం తెలుసుకోవడానికి లోకేష్ రోడ్డు ఎక్కుతారు. టీడీపీ రాబోయే రోజుల్లో పటిష్టంగా మారుతుందన్నారు.