ఓయ్ ముద్దపప్పు.. నోరు లేస్తోంది.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. కాస్త నోరు అదుపులో పెట్టుకో' అంటూ వైసీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ నేత నారా లోకేష్‌పై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో రెండు కోట్లతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు - నేడు ఏం జరిగిందో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.