Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. ఇప్పటికే నారా ఫ్యామిలీ చంద్రబాబును కలిసింది.. 40 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి భేటీ అయ్యారు.. మరోవైపు.. ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రస్తుతం చంద్రబాబు కేసును వాదిస్తోన్న సిద్ధార్థ్ లూథ్రా కూడా ములాఖత్‌లో చంద్రబాను కలిశారు.. ఈ కేసు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చించారు. ఇక నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ కలబోతున్నారు.
Also Read: Off The Record: చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ స్టాండ్ ఏంటి..? సడన్‌గా మౌన వ్రతం ఎందుకు?
నేడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తొలిసారి ఒకే పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో బాలయ్య, పవన్, లోకేష్ ములాఖత్ కానున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య, లోకేష్ రానున్నారు. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ముగ్గురు కలిసి 11:30 తర్వాత చంద్రబాబుతో ములాఖత్ కానున్నట్లు సమాచారం. ములాఖత్ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్లనున్నారు.