Chandrababu Naidu and Nara Lokesh Names in AP CID’s Remand Report: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించించింది. ఈ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. 2021లో పేర్కొన్న ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఆయన పేరును చేర్చారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్…
ఈ రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా చేర్చారు. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా నారా లోకేష్ కు డబ్బులు అందినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోందన్నారు. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చేసింది అని మంత్రి కొట్టు పేర్కొన్నారు.