Rajinikanth: చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. సూపర్ స్టార్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ మొత్తం అట్టుడికిపోతుంది. టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఏపీ బంద్ ను ప్రకటించిన విషయం కూడా విదితమే. ఇక రెండు రోజులుగా చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలతో పాటు.. చంద్రబాబును సపోర్ట్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇక నేటి ఉదయం.. చంద్రబాబు అరెస్ట్ పై నిర్మాత అశ్వినీదత్ స్పందించిన విషయం తెల్సిందే. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం చంద్రబాబుకు మద్దతు తెలిపాడు. నారా లోకేష్ కు రజినీ కాల్ చేసి..మాట్లాడినట్లు సమాచారం అందుతుంది.
Ashwini Dutt: చంద్రబాబు అరెస్ట్.. ప్రభాస్ నిర్మాత శాపనార్ధాలు!
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నారా లోకేష్ కు రజినీ కాల్ చేసి.. ” నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు..చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష.. మీరేమి భయపడకండి.. ఖచ్చితంగా చంద్రబాబు బయటికి వస్తారు.. కుటుంబం జాగ్రత్త” అని లోకేష్ కు ధైర్యం చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. నందమూరి కుటుంబానికి రజినీ కి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిమానంతోనే రజినీ.. ఈ మధ్య జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొని చంద్రబాబు గురించి మాట్లాడి వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. అప్పట్లో రజినీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికి తెల్సిందే. అయినా ఈ వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడని సూపర్ స్టార్.. అంత జరిగినా.. మిత్రుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి సపోర్ట్ చేయడం నిజంగా మంచి విషయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!