ఏపీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపైఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. అయితే.. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో మంత్రి అయ్యాను.. కానీ, నువ్వు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయావు.. మీ తాత.. మీ నాన్న ముఖ్యమంత్రి కాకపోతే వార్డు కౌన్సిలర్ కూడా గెలవలేవు అంటూ నారా లోకేష్ పై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అనిల్ ..