నేచురల్ స్టార్ నాని “బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది సినిమాల గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నాని స్పందన. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ళ చిన్నారిని క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ అమానవీయ ఘటనపై మండిపడుతున్నారు. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు…
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. పలువురు సినీ ప్రముఖులు చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మట్టితో చేసిన వినాయకుడికి భార్యతో కలిసి పూజలు చేశారు. మరోవైపు, సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పారు. ఈ కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని…
నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. సరిగ్గా యేడాది తర్వాత మళ్ళీ అందులోనే ‘టక్ జగదీశ్’ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటరా? ఓటీటీనా? అనేది తేల్చుకోలేక కొన్ని నెలల పాటు సతమతమైన నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది చివరకు ఓటీటీ వైపే మొగ్గు చూపారు. దాంతో ఎగ్జిబిటర్స్ నుండి కాస్తంత వ్యతిరేకత ఎదురైనా… వెనక్కి తగ్గకుండా వినాయక చవితి కానుకగా ‘టక్ జగదీశ్’ను వ్యూవర్స్…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” రేపు విడుదల కావాల్సి ఉంది. ఓటిటి విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన అనంతరం మేకర్స్ ఈ సినిమాను వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే సినిమా “టక్ జగదీష్” అనుకున్న సమయం కంటే ముందుగానే అందుబాటులోకి రానున్నాడు. ఈ రోజు రాత్రి 10 గంటల తరువాత అమెజాన్ ప్రైమ్ లో “టక్ జగదీష్” ప్రీమియర్ కానుంది. Read Also…
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన “వి” చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తి అవుతోంది. ఈ మూవీ 2020 సెప్టెంబర్ 5న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కూడా సహాయక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన “వి” నానికి 25వ చిత్రం. ఇందులో నాని తన కెరీర్లో మొదటిసారి నెగటివ్ షేడ్ ఉన్న…
నాచురల్ స్టార్ నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విడుదల అయ్యి నేటికి ఆరేళ్ళు అవుతోంది.. ఈ చిత్రంతో నాని ప్రత్యేక గుర్తింపు పొందాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మతిమరుపును ప్రధానాంశంగా కథను రాసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. నానిని నటన పరంగాను మరోమెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఆయన సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. ఆమె కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావడం విశేషం. గోపీసుందర్ అందించిన పాటలు…
నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఇందులో నానితో రీతూ వర్మ రొమాన్స్ చేస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను కోరి” తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం “టక్ జగదీష్”. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న…
“టక్ జగదీష్” ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది. చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఉమ్మడి కుటుంబం నివసించే భూదేవిపురం కథను, తన తండ్రి కోరిక మేరకు భూదేవిపురాన్ని ప్రతీకార రహిత గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను టక్ జగదీష్ తీసుకుంటాడని చూపించారు. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ లతో పాటుగా నాని, రీతూ వర్మ మధ్య రొమాన్స్ వంటి అంశాలు కూడా ట్రైలర్లో ఉన్నాయి. బాధ్యతాయుతమైన పాత్రలో నాని, హీరోయిన్ రీతూ వర్మ బాగున్నారు. జగపతి…
తన తదుపరి సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తానని టాలీవుడ్ హీరో నాని సంచలన ప్రకటన చేశారు. నేడు టక్ జగదీష్ ట్రైలర్ ఈవెంట్ సందర్బంగా నాని ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘టక్ జగదీష్ విడుదల విషయంలో నన్ను బయటి వాడిలా చూడటం బాధ కలిగించింది. బయట పరిస్థితులు బాగున్నప్పుడు కూడా నా సినిమా థియేటర్ కు వెళ్లకపోతే ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు నన్ను నేనే బ్యాన్…
నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ‘టక్ జగదీష్’.. నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాజర్, జగపతిబాబు, నరేశ్, రావురమేశ్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ మొత్తం…