‘రాజా విక్రమార్క’ ట్రైలర్: కార్తికేయకు దూల ఎక్కువే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఇంటెన్సివ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఈ చిత్రం తర్వాత విభిన్న కథలతో తెరపై కనిపిస్తున్న ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే థ్రిల్ చేసింది.
ట్రైలర్ విషయానికొస్తే.. అల్లరిచిల్లరిగా కనిపించే ఎన్ఐఏ ఏజెంట్ అయిన కార్తికేయ హోమ్ మంత్రిని ఒక ప్రమాదం నుంచి కాపాడడానికి సీక్రెట్ మెషిన్ ప్లాన్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే హోమ్ మంత్రి కూతురితోనే ప్రేమలో పడతాడు. ఇక ఈ మెషిన్ లోకి శత్రువులు ఎంటరవుతారు. వారిని అడ్డుకొని ఏజెంట్ విక్రమ్ హోమ్ మంత్రి ని కాపాడాడా..? హీరోయిన్ ప్రేమను పొందాడా..? అనేది మిగతా కథగా తెలుస్తోంది. ఎన్ఐఏ ఏజెంట్ గా కార్తికేయ లుక్, బాడీ కట్ అవుట్ అదిరిపోయిందని చెప్పాలి..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇక ట్రైలర్ ని సగం హ్యూమర్ తో మిగతా సగం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. సహాయ పాత్రల్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కామెడీ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ విశేషంగా అలరిస్తోంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అలరించింది. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12 న విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో కార్తికేయ హిట్ టాక్ ని అందుకుంటాడేమో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు