విభిన్న కథలతో తెలుగు సినీ ప్రేమికులను అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ‘టక్ జగదీష్’ అనే ఫామిలీ ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఇప్పుడు నెక్స్ట్ మూవీకి సిద్ధమయ్యాడు. దసరా కానుకగా నాని తన 29వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్టర్ విడుదల చేసి ఆసక్తిని పెంచేశాడు. అక్టోబర్ 15న మధ్యాహ్నం 1:53 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి నాని ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Read Also : దసరా వార్ లో ముగ్గురు హీరోలు… తగ్గేదెవరు, నెగ్గేదెవరు ?
ఈ పోస్టర్‌లో గూడ్స్ రైలు పొగలు కక్కుతూ వెళ్తున్నట్టు కన్పిస్తోంది. పోస్టర్ డిజైన్ దాని రంగు, ఫాంట్ సరికొత్తగా ఉండడంతో కథ ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డారు నెటిజన్లు. ఈ సినిమాకు దర్శకుడు, టైటిల్‌తో సహా ఇతర టెక్నీకల్ టీం వివరాలను దసరాకు వెల్లడించనున్నారు. నాని 29వ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నాని మునుపెన్నడూ కనిపించని లుక్ లో కనిపిస్తాడని, ఆయన పాత్ర పాత్ర కూడా చిత్రాలన్నింటికీ భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఇక నాని ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ పూర్తి చేసి, ‘అంటే సుందరానికి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.