నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా పీరియాడికల్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానంతర దశలో ఉంది. ట్యాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్‌లను ఆవిష్కరించినప్పటికీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం సారధ్యం వహిస్తుండగా, మేకర్స్ త్వరలో మ్యూజిక్ ప్రమోషన్స్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Read Also : విజయ్ దేవరకొండ, దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ప్లాన్
ఈ నేపథ్యంలో సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ’ సొంతం చేసుకుంది. ఈ పాపులర్ ఆడియో సంస్థ “శ్యామ్ సింగ రాయ్” మ్యూజిక్ రైట్స్ కోసం భారీగా చెల్లించినట్టు తెలుస్తోంది. సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల రైట్స్ ఇప్పుడు ‘సరిగమ’కు సొంతం. “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా పలు భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ కాగా, నవీన్ నూలి ఎడిటర్.