నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ…
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుని ఇప్పుడిపుడే సినిమాల విడుదలలు ఊపందుకుంటున్నాయి. గత వారం ‘పాగల్, రాజరాజచోర’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా ఈ వారం ‘శ్రీదేవి సోడాసెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు’ పలకరించాయి. వచ్చే వారం ‘సీటీమార్’, ఆ పై వారం ‘లవ్ స్టోరీ’ విడుదల కాబోతున్నాయి. ఇక ‘లవ్ స్టోరీ’ విడుదలవుతున్న రోజునే ఓటీటీలో నాని నటించిన ‘టక్ జగదీష్’ రిలీజ్ ని అధికారికంగా ప్రకటించారు. Read Also: ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ…
నేచురల్ స్టార్ నాని “టక్ జగదీష్” మూవీపై బిగ్ అప్డేట్ అంటూ నిన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దానికి కారణం నాని ట్వీట్. నాని “రేపు” అంటూ ట్వీట్ చేయడంతో ఆ విషయం ఏమై ఉంటుందా ? అనే ఆసక్తి మొదలైంది. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర దించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ అధికారికంగా ప్రకటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ…
నేచురల్ స్టార్ నాని రేపు అప్డేట్ ఉంటుంది అనేలా హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ అర్థం “టక్ జగదీష్” సినిమా రిలీజ్ డేట్ అని అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో “టక్ జగదీష్” సినిమా రిలీజ్ డేట్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న ఓటిటిలో విడుదలవుతుందని ప్రచారం జరగడం, అదే రోజున థియేటర్లలోకి “లవ్ స్టోరీ” రావడం, కరోనా పరిస్థితులు ఈ వివాదానికి కారణం అయ్యాయి. దీంతో…
గత కొన్ని రోజుల నుంచి టక్ జగదీష్ వర్సెస్ లవ్ స్టోరీ కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతోంది. అదే రోజున నాని “టక్ జగదీష్” ఓటిటి బాటను ఎంచుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ నానిని, చిత్రబృందాన్ని ఏకి పారేశారు. ఆ తరువాత తాము ఎవరినీ కించపరడానికి లేదా బాధ పెట్టడానికి ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుపుతూ సారీ చెప్పారు. ఈ నేపథ్యంలో “టక్…
‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని, మరీ ముఖ్యంగా ఆ సినిమాను ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే స్ట్రీమింగ్ చేయించాలని అనుకోవడాన్ని శుక్రవారం తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ తప్పు పట్టింది. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పలువురు థియేటర్ ఓనర్స్ ‘టక్ జగదీశ్’ హీరో నానిపై వ్యక్తిగత విమర్శలూ చేశారు. అయితే…. శనివారం ఆ విషయమై తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ క్షమాపణలు కోరింది. ఎవరినీ వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ విమర్శించడం తమ అభిమతం…
మన హీరోలు ఓటీటీలో సినిమాలు విడుదలపై ఆందోళనకు గురి అవుతున్నట్లు వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను బట్టి అర్థం అవుతోంది. ఇటీవల నాని తన సినిమా ‘టక్ జగదీశ్’ను థియేటర్ లో విడుదల చేయాలా? లేక ఓటీటీ రిలీజ్ చేయాలా? అనే కన్ఫ్యూజన్ లో క్రాస్ రోడ్స్ లో ఉన్నానని లేఖను విడుదల చేస్తూ తనకు మాత్రం థియేటర్స్ లో విడుదల అంటేనే మక్కువ అని స్పష్టం చేశాడు. అలాగే అంతకు ముందు వెంకటేశ్ నటించిన ‘నారప్ప’…
సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్…