నాని హీరోగా రూపొందుతున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాష్టియన్ హరోయిన్స్ గా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వరస పరాజయాల్లో ఉన్న నానికి ఈ సినిమా విజయం ఎంతో ముఖ్యం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ‘శ్యామ్ సింగ్ రాయ్’ ని విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.