న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వవిడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలనే నెలకొల్పేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ని రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో మేకర్స్ రిలీజ్ చేశారు. 1970ల కాలంలో, కలకత్తాలో తిరుగులేని బెంగాలీ నాయకుడిగా నాని కనిపించాడు.
పాట మొత్తం శ్యామ్ సింగరాయ్ వ్యక్తిత్వాన్ని, అతను నాయకుడిగా ఎదిగిన వైనాన్ని తెలియజేశారు. “శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ సాగిన ఈ పాట గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. కృష్ణకాంత్ సాహిత్యం.. మిక్కీ జే మేయర్ సంగీతం.. అనురాగ్ కులకర్ణి వాయిస్ మధ్యలో విశాల్ దద్లాని వోకల్స్ తో సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న చిత్రం డిసెంబర్ 24న విడుదల కానుంది.