రస్టిక్ లుక్ లో నాని… ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘దసరా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ఇటీవలే ‘టక్ జగదీష్’గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి సిద్ధమైపోయాడు. విభిన్న పాత్రలతో, విభిన్న శైలిలో ప్రయోగాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు.
‘దసరా’లో నాని ఫస్ట్ లుక్ రస్టిక్ గా ఉంది. మేకర్స్ ‘సైరన్ ఆఫ్ దసరా’ అనే డైలాగ్ ప్రోమోను ఆవిష్కరించారు. బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణలోని అత్యంత ప్రజాదరణ పొందిన ‘బతుకమ్మ’ పాటతో ప్రారంభమైన ఈ వీడియోలో నాని చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ప్రేక్షకుల్లో ‘దసరా’ పండగ జోష్ ను పెంచేసింది. “ఈ దసరా నిరుడు లెక్కుండది, బాంచన్ జమ్మి వెట్టి చెప్తాన్న బద్దల్ బాషింగాలైతయ్, ఎట్లైతే గట్లైతది, సూస్కుందాం” అంటూ అచ్చమైన తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్, ఆ వీడియో సినిమాపై ఆసక్తిని, అంచనాలను అమాంతం పెంచేశాయి.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
Read Also : కన్నడ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ నెక్స్ట్
‘దసరా’కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ‘దసరా’ సినిమా కథ గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామంలో జరుగుతుంది. ‘దసరా’ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, జాతీయ అవార్డు గెలుచుకున్ననటి కీర్తి సురేష్ నానితో స్క్రీన్ స్పేస్ పంచుకోనుంది. గతంలో వీరిద్దరి కాంబోలో ‘నేను లోకల్’ సినిమా వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సాయి కుమార్, సముద్రకని, జరీనా వహబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!