TDP vs YCP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిపై తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విసిరిన సవాల్ కు మాజీ శాసన సభ్యుడు శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు.
భూమా అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. రూ. 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న కూటమి ప్రభత్వాన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.. ఇక, కళ్లు తిరిగి పడిపోయి నేను హాస్పిటల్ లో ఉంటే.. నన్ను చూడటానికి ఎవరు వచ్చారు..? ఎవరు రాలేదంటూ..? వార్తలు రాస్తున్నారు…
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి.. బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. Also Read: Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం…
ఏపీలో కానిస్టేబుల్ హత్య ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ఈ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం పెద్ద కంబులూరుకి చెందిన కానిస్టేబుల్ ఫరూక్.. మంగళగిరి లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తూ నాలుగు రోజుల క్రితం అదృశ్యం కాగా.. మృతదేహం నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్ల వద్ద బయటపడింది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు సమావేశం కానున్నారు. కర్నూలు, నంద్యాల చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లు సమావేశంలో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ నిర్వహించే సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ…
మాకు రైతులకు.. ప్రజలకు సేవనే మాకు ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెట్టారని గుర్తుచేశారు.. రైతులను రౌడీ షీటర్లుగా మార్చారని ఆరోపించిన ఆయన.. కలెక్టరేట్ వద్ద వైస్సార్సీపీ నేతలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు..
Nandikotkur: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది చేతిలో హతమైన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. లహరి మృతికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో రామాంజనేయులు అనే మోసగాడు సుమారు రూ. 25 కోట్లు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు పదివేలు ఇస్తామంటూ నమ్మబలికాడు కేటుగాడు.. అలా దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేశారు. కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 300 మందికి పైగా భాదితులు ఉన్నట్టు సమాచారం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గడచిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవి తరపున ప్రచారం నిర్వహించేందుకు నంద్యాలలో ఎన్నిల ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే పోలీసుల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారీ జనసందోహం గుమికూడేలా చేసారని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. పుష్పా -2 షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ మధ్యలో నంద్యాలకు వెళ్లిన బన్నీని చూసేందుకు వేల సంఖ్యలో…