Road Accident: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి!
- నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
- ఎస్ఎన్ తండా వద్ద బొలెరో వాహనం బోల్తా
- రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి.. బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Also Read: Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..
Also Read
ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో ఆటో బోల్తాపడి ఆదోనికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!