నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ఆ బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. నిందితులు సంతోష్ నాయక్, అజయ్, సుభాష్ మైనర్లుగా గుర్తించారు. కాగా.. ఈ వీడియోలు వైరల్ కావడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
Bunny Vasu Intresting Comments on Allu Vs Mega issues: అల్లు కాంపౌండ్ లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులలో బన్నీ వాస్ కూడా ఒకరు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన చిన్న సినిమాల నిర్మాణం విషయంలో యాక్టివ్గా ఉన్నాడు. ఎన్టీఆర్ బావమరిది హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బన్నీ వాస్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం గురించి ఒక…
నంద్యాల జిల్లాలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. అయితే, నిన్న రాత్రి పచ్చర్ల సమీపంలో బోనులో చిరుత చిక్కుకుంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఇటీవల నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసింది. ఎన్నికల వేళ మద్యం ఏరులై పారడం సహజం.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంత సిద్ధం బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది.
ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలిన ఆ గడ్డపై ఇప్పుడు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. హత్యారాజకీయాలతో అట్టుడుకిపోయిన ఆ నేల ఇప్పుడు దైవ నామస్మరణలతో మార్మోగిపోతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆ నాయకుడు... ప్రజలకు సేవ చేయడమే కాదు... లెక్కకు మించిన దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ ధార్మిక సేవలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఆయనే బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లెలో ధర్మ పరిరక్షణకు బీసీ జనార్థన్…
కొంత మంది వింత చేష్టలతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మందు తాగి నానా హంగామా చేస్తుంటున్నారు. నడి రోడ్డుపైనే నిలబడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు..