Nandikotkur: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది చేతిలో హతమైన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. లహరి మృతికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటలకు చదువుకోవాలని పక్క రూంలోకి వెళ్లిందని మృతురాలి అమ్మమ్మ తెలిపింది. గతంలో కూడా చెల్లెలు అని చెప్పి రాఘవేందర్ ఇంటికి వచ్చేవాడని లహరి అమ్మమ్మ చెప్పుకొచ్చింది.
Read Also: Super Star Of The Year : ‘సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ ఎవరికి దక్కుతుందో తెలుసా ?
కాగా, మరోసారి ఇటువైపు రావొద్దని తాము మందలించాం.. ఈ మధ్య కాలంలో రాకుండా మానేశాడని మృతురాలి అమ్మమ్మ పోలీసులకు తెలిపింది. అయితే, తెల్లవారుజామున రూము నుంచి గట్టి శబ్దాలు రావడంతో అమ్మాయి తాత వెళ్లి చూశాడని అప్పటికే అమ్మాయి కాలిపోయిందని లహరి అమ్మమ్మ వాపోయింది. తన మనవరాలి నోట్లో బట్టలు కుక్కి మరి పెట్రోల్ పోసి తగల పెట్టిన నిందితున్ని శిక్షించాలని డిమాండ్ చేసింది. అయితే, సంఘటన స్థలాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ అభిజిత్ సింగ్ రాణా పరిశీలించారు. సంఘటన గురించి జిల్లా ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.