సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు దండుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. కానిస్టేబుల్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు సంబంధం ఏమిటనుకుంటున్నారా?. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రాఫిక్ కానిస్టేబుల్ రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు శుభకార్యాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఇంకోవైపు, కుటుంబ పెద్దలను, కుమారులను కోల్పోయినవారిని కూడా పరామర్శిస్తూ.. వారికి ధైర్యాన్ని చెబుతూ వస్తున్నారు.. ఇక, ఇవాళ తిరుపతి, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం తిరుపతికి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. సాయంత్రం 5 .15కు తుమ్మలగుంట చేరుకోనున్నారు.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్…
DGP Rajendranath Reddy :ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐపీఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఖాకీల బదిలీలు వారి మధ్య చిచ్చు పెట్టాయా? సమస్య డీజీపీ దగ్గరకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? పోలీస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..!
గత నెల 14వ తేదీన జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె తమ్ముడు కూడా ఇందుకు సహకరించడం మరో షాకింగ్ విషయం. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్.. బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనాతో వివాహమైంది. వీరికి…
ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు (ఏప్రిల్ 8) నంద్యాలలో పర్యటించనున్నారు. ఎస్‌పీజీ గ్రౌండ్ నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో నంద్యాలకు బయలుదేరనున్నారు. ఉదయం 11:10 గంటలకు నంద్యాల గవర్నమెంట్ డిగ్రీకాలేజీకి చేరుకుంటారు. ఉదయం 11:35- 12:35 గంటల మధ్య ఎస్‌పీజీ గ్రౌండ్‌కి చేరుకుని జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో…