నంద్యాలలో ఘరానా మోసం వెలుగు చూసింది. పి.ఎం.జే. జ్యువలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ లో ఇంటి దొంగల ముఠా చేతివాటం ప్రదర్శించారు. కాజేసిన సొత్త ఖరీదు రూ 16.6 కోట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కంచర్ల రాఘవ కుమార్. ఇంటి దొంగలు ముఠాగా ఏర్పడ్డ వారిలో మేనేజర్ చిద్విలాస్ రెడ్డి, క్యాషియర్ రమేష్ రెడ్డి, స్టాక్ ను రికార్డు చేసే ఉద్యోగి బండారి లహరి కుమార్ ఉన్నట్లు పోలీసులు…
ఏపీకి చెందిన మరో 44మంది టూరిస్టులు అక్కడ చిక్కుకున్న వార్తలు కలవరపెడుతున్నాయి.. నంద్యాల నుండి ముక్తినాథ్ యాత్రకు వెళ్లి , నేపాల్ లో చిక్కుకున్నారు 44 మంది యాత్రికుల బృందం.. దీంతో, మంత్రి ఫారూఖ్ ను ఆశ్రయింయారు యాత్రికుల కుటుంబ సభ్యులు.. వెంటనే హోంమంత్రి అనిత , జిల్లా కలెక్టర్ రాజకుమారితో మాట్లాడిన మంత్రి ఫరూక్.. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు..
గుట్కా ప్యాకెట్ల వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్‌పై జనసేన నేత దాడి చేయడం కలకలం సృష్టించింది.. నంద్యాలలో ఈ ఘటన జరిగింది.. జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణిని చితకబాదారు జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్..
పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులై జిల్లాల పర్యటనకు రావడమే వారికి కాసులు కురిపించిందా…గతంలో ఎన్నడూ లేని సంప్రదాయానికి ఆ జిల్లాలో తెర తీసారా….అధ్యక్షుని పర్యటన పేరుతో భారీగా వసూళ్లు చేసారా….ఈ వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ అయిందా…. బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవ్…జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశం, చాయ్ పే చర్చ, బీజేపీ శ్రేణులతో ర్యాలీ, సమావేశం, వ్యాపార వర్గాలు, మేధావులతో సమావేశం…ఇలా కొత్తరకంగా మాధవ్ పర్యటన షెడ్యూల్ సాగింది. అయితే మాధవ్ పర్యటన…
Restaurant Worker Gets RS 4.60 Cr Notice in Nandyal: నంద్యాల జిల్లాలో జీఎస్టీ కలకలం రేపింది. మిడుతూరు మండలం పైపాలెంకు చెందిన నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి రూ.4.60 కోట్లు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. రెస్టారెంట్ ఉద్యోగినైన తనకు కోట్లలో జీఎస్టీ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. జీఎస్టీ నోటీసులపై అటు మిడుతూరు, ఇటు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించినా ఫిర్యాదు తీసుకోలేదు. ఏమి చేయాలో అర్థంకాక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు…
Chenchu Youth Tiger Attack in Atmakur Forest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవి రేంజ్ పరిధిలో చెంచు యువకుడుపై పెద్దపులి దాడి చేసింది. జనాలు కేకలు వేయడంతో పెద్దపులి యువకుడుని వదిలి అడవిలోకి పారిపోయింది. యువకుడిని మెరుగైన వైద్య సేవల కోసం అటవీశాఖ సిబ్బంది ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్దపులి రాకతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సదరం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి కర్నూల్ బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్లను చంద్రబాబు కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం, రంగాల వారీగా పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాలకు సంబంధించి జనశక్తి శాఖ…
నంద్యాల జిల్లాలో జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య.. ఎంతో మంద్రి క్రిమినల్స్ బిచ్చగాళ్ల రూపంలో తిరుగుతున్నారనే సంచలన విషయాన్ని బయటపెట్టింది.. 120 మంది బిచ్చగాళ్లలో 30 మందికి నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులకు నివేదిక అందింది.. డేటా సేకరించి పోలీసులు.. వారిని మందలించి పంపినట్టుగా తెలుస్తోంది..
నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల శివారు కర్నూలు బై పాస్ రోడ్డులోని ఎల్.కే. ఆర్. ఫంక్షన్ హల్ వద్ద హత్య జరిగింది. ఆటో డ్రైవర్ వినయ్ కుమార్ అలియాస్ మోతిని మిత్రులే రాళ్లతో కొట్టి చంపేశారు. వినయ్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ దావత్లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
నంద్యాల..... ఏ సీజన్లోనూ పొలిటికల్ హీట్ తగ్గని జిల్లా ఇది. అందులోనూ.... ఇక్కడి టీడీపీలో అయితే... ఆ డోన్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటారు. ఈ జిల్లాలో ప్రత్యర్థి పార్టీ వైసీపీతో కంటే... తెలుగుదేశంలోని గ్రూప్వారే ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ పోరు బహిరంగమవుతూ.... అప్పుడప్పుడూ వీధికెక్కుతూ ఉంటుంది కూడా. మరోసారి ఇదే తరహా రచ్చ మొదలై... పార్టీ పరువు రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్ళు.