Jana Sena Leader attack on Head Constable: గుట్కా ప్యాకెట్ల వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్‌పై జనసేన నేత దాడి చేయడం కలకలం సృష్టించింది.. నంద్యాలలో ఈ ఘటన జరిగింది.. జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణిని చితకబాదారు జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్.. అయితే, భగత్ సింగ్ కాలనీ సమీపంలోని కిరాణా షాపులో గుట్కా ప్యాకెట్లను అమ్ముతుండగా ఫొటోలు తీశాడు హెడ్ కానిస్టేబుల్ మణి.. దీంతో, హెడ్ కానిస్టేబుల్ మణితో ఘర్షణకు దిగారు షాపు యజమాని లక్ష్మీ.. అంతేకాదు, సమీపంలోనే మద్యం తాగుతున్న సుధాకర్ , అతని బ్యాచ్ కు ఫోన్ చేసిన ఈ విషయం చెప్పింది.. దీంతో, కారులో ఘటనా స్థలానికి చేరుకున్న సుధాకర్ అండ్ బ్యాచ్.. హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి దిగింది.. అయితే, తాను పోలీసునని చెప్పినా వినిపించుకోకుండా.. సుధాకర్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు..
Read Also: Pune: పూణెలో కూలిన శిక్షణా విమానం.. పైలట్ సురక్షితం
ఈ వ్యవహారంపై ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణకు ఫిర్యాదు చేశారు హెడ్ కానిస్టేబుల్.. మరోవైపు ఘటనా స్థలాన్ని చేరుకున్న రూరల్ సీఐ ఈశ్వరయ్య, పోలీసులు.. అసలు గొడవ, దాడికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు.. మరోవైపు.. జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్ పరారయ్యాడు.. మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఘటనపై జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సీరియస్ అయ్యారు.. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కొట్టినట్టు కేసు నమోదు చేశారు.. పరారీలో ఉన్న సుధాకర్ కోసం గాలిస్తున్నట్టు చెబుతున్నారు రూరల్ పోలీసులు..