నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల శివారు కర్నూలు బై పాస్ రోడ్డులోని ఎల్.కే. ఆర్. ఫంక్షన్ హల్ వద్ద హత్య జరిగింది. ఆటో డ్రైవర్ వినయ్ కుమార్ అలియాస్ మోతిని మిత్రులే రాళ్లతో కొట్టి చంపేశారు. వినయ్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ దావత్‌లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
నంద్యాల..... ఏ సీజన్‌లోనూ పొలిటికల్ హీట్ తగ్గని జిల్లా ఇది. అందులోనూ.... ఇక్కడి టీడీపీలో అయితే... ఆ డోన్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటారు. ఈ జిల్లాలో ప్రత్యర్థి పార్టీ వైసీపీతో కంటే... తెలుగుదేశంలోని గ్రూప్‌వారే ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ పోరు బహిరంగమవుతూ.... అప్పుడప్పుడూ వీధికెక్కుతూ ఉంటుంది కూడా. మరోసారి ఇదే తరహా రచ్చ మొదలై... పార్టీ పరువు రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్ళు.
దోపిడీ దొంగను పట్టుకోవడానికి పోలీసులు కోవర్టు అపరేషన్ చేపట్టారు. చెంచు యువకులను ఇన్‌ఫార్మర్‌లుగా మార్చి దొంగను పట్టుకునే యత్నం చేశారు. చెంచు యువకుల బాణాలకు దొంగ గాయపడి అడవిలోకి పరారయ్యాడు. చికిత్స కోసం అడవి నుంచి బయటికి వస్తే అరెస్టు చేయాలని పోలీసుల ప్రయత్నిస్తున్నారు. బండి ఆత్మకూరు మండలంలోని నారపరెడ్డికుంటలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగ హనుమంతు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడిపై 12కు పైగా దొంగతనం,…
నంద్యాల విజయ డైరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలను తాత్కాలికంగా రద్దు చేశారు.. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఆళ్గడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరులు భారీ సంఖ్యలో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో, పోలీసుల సలహా మేరకు నామినేషన్ ప్రక్రియ వాయిదా వేసినట్లు ప్రకటించారు నంద్యాల విజయ డైరీ ఎండీ ప్రదీప్..
గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ తప్ప.. వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటర్ డ్రైనేజీ పనులు కూడా చేయ లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. జుర్రెరు వాగు నీరు కలుషితం కాకుండా 30 నెలల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనులు పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నాం అని మంత్రి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో రూ.30.66…
రన్నింగ్ బస్సు టైర్ పేలి.. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నరాయి.. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.. బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలో టైర్ పేలడం కాకుండా.. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ఈరోజు (శుక్రవారం) నంద్యాలలో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:25కు పట్టణంలోని శ్రీనివాసనగర్లో మంత్రి నాస్యం మహమ్మద్ ఫరూఖ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.