Nimmala Rama Naidu: చంద్రబాబు ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా, ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటన చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఎన్టీఆర్ కలగన్నట్లు రాయల సీమను రతనాల సీమగా మారుస్తాం.. ఆసియాలోనే పెద్దది, పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత టీడీపీదే. 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా చంద్రబాబు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. జగన్ పాలనలో హంద్రీ నీవా పనులు వెనుకబడిపోయాయి. ప్రాజెక్ట్ సామర్థ్యం 40 వేల టీఎంసీలు. అయితే కనీసం 20…
నంద్యాల పట్టణ శివారులో వక్ఫ్ బోర్డ్ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి కూల్చడానికి వెళ్లిన అధికారుల బృందానికి చుక్కెదురైంది. ఆ ఇంటి యజమాని తన ఇంటిని కూలిస్తే చనిపోతానని బెదిరించాడు. కూల్చడానికి సిద్ధమవుతున్న తహసీల్దార్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఇంటి యజమాని ఉరుకుంద.
నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.. బాలికకు అండగా ఉంటానని ప్రకటించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. నేడు శ్రీశైలం రానున్నారు.. సీఎం చంద్రబాబు. ఉదయం 10:30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10:50కి శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు.
Leopard Roaming In Mahanandi : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో చిరుత గత 22 రోజులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. చిరుత సంచారానికి సంబంధించిన సిసిటీవీ ఫోటేజీలలో కూడా చాలానే మీడియా ద్వారా బయటికి వచ్చాయి. 22 రోజులుగా మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ చిరుత చక్కర్లు కొడుతుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు అనేక మార్గాలను చేస్తున్నారు. మహానందిలోని విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం,…
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అయితే, చిరుతపులి మహానంది క్షేత్రంలోని పరిసర ప్రాంతంలోనే తిరుగుతుంది. అక్కడే సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి.