టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ “బంగార్రాజు” చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనయుడు అక్కినేని నాగ చైతన్య ఈ పోస్టర్ ను లాంచ్ చేశారు. పోస్టర్ లో నాగార్జున గతంలో నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రంలోని “బంగార్రాజు” పాత్రల్లో కనిపిస్తుండగా మనసును దోచేందుకు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి ఈ లుక్ ను చూసిన అక్కినేని అభిమానుల్లో…
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఖచ్చితంగా విడుదలవుతుందని భావించారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే నాని నటించిన ‘టక్ జగదీష్’ అదే రోజున ఓటీటీలో విడుదల కానుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు, సినిమా థియేటర్లలో…
అక్కినేని కోడలు సమంత వారసుల కోసం నటనకు గ్యాప్ తీసుకుంటుందా!? అంటే అవునని చెప్పక తప్పదు. ప్రస్తుతం సమంత వయసు 34 సంవత్సరాలు. గత 11 సంవత్సరాలుగా విరామం ఎరుగక పని చేస్తూనే ఉంది సమంత. 2017లో పెళ్ళైన తర్వాత కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇంకా ఎక్కువ బిజీ అయింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న తారల్లో సమంత ముందు వరుసలోనే ఉంటుంది. ఇక ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 2 తో డిజిటల్…
రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆకట్టుకొంది. నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మలిచాడు విజయ్ కనకమేడల.. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదివరకే విజయ్ కనకమేడల నరేట్ చేసిన స్టోరీకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు…
“బంగార్రాజు” కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. “వైల్డ్ డాగ్”లో చివరిసారిగా కనిపించిన నాగార్జున “బంగార్రాజు”లో తన కుమారుడు నాగ చైతన్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. “మనం” తర్వాత తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్ పై కన్పించడం ఇది రెండోసారి. ఆగస్టు 20న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన…
ఎట్టకేలకు కింగ్ నాగార్జున “బంగార్రాజు” పట్టాలెక్కింది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగ్ బంగార్రాజు పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. అప్పట్టోనే దానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా తీస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా…
కథ, కథనం బాగుంటే తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్స్ కి ఏమి ఢోకా లేదని ఇప్పటికే చాలా సినిమాలు రుజువుచేశాయి. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్ల పట్ల అభిమానుల్లో ఆసక్తి వున్నా సరైన సినిమా రాలేదనిది ఓ వర్గ అభిమానుల ఆవేదన.. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో ఒకటి, రెండు మాత్రమే ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాలు ఏవి రాకపోవడంతో కాస్త నిరాశగానే…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి కళ్ళు కాయలు…
స్టార్ జంట నాగ చైతన్య, సమంత కల త్వరలోనే నెరవేరబోతోంది. గోవా ఈ దంపతులకు ఇష్టమైన హాలిడే స్పాట్. వీరిద్దరూ గోవాలోనే వివాహం చేసుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా సమంత, చైతన్య గోవాలో పార్టీ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందనే. అయితే కొంతకాలం నుంచి చైతు, సామ్ గోవాలో విలాసవంతమైన బీచ్ హౌజ్ కోసం వెతుకుతున్నారట. తాజాగా వీరికి తాము కలలుగన్న డ్రీమ్ ప్లేస్ దొరికిందట.…