టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కోడలు సమంత ఆయనకు బెస్ట్ విషెస్ అందించింది. “మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు మామ” అటూ సామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ అక్కినేని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నాగ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సామ్ తో పాటు ఆయన ఇద్దరు కుమారుడు నాగ చైతన్య, అఖిల్ కూడా నాగ్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అఖిల్ తమ ఫ్యామిలీ ఫోటోను పంచుకుంటూ తండ్రిని విష్ చేయగా, చైతన్య తండ్రీకొడుకుల కాంబోలో రాబోతున్న “బంగార్రాజు” పోస్టర్ ను రివీల్ చేసి తండ్రికి పుట్టినరోజు విషెస్ చెప్పారు. మరోవైపు సెలెబ్రిటీలు కూడా నాగార్జునను విష్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.
Read Also : “బంగార్రాజు” వచ్చేశాడు… నాగ్ బర్త్ డే పోస్టర్ !
ప్రస్తుతం నాగార్జున “ఘోస్ట్” అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ యాక్షన్ మూవీ రూపొందనుంది. ఈ రోజు ప్రత్యేకంగా సినిమా నుంచి నాగ్ ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమా తరువాత నాగార్జున “బంగార్రాజు” చిత్రంలో నటించనున్నారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం “థాంక్యూ” చిత్రం చేస్తున్నారు. అఖిల్ “ఏజెంట్”తో బిజీ, సామ్ “శాకుంతలం” పూర్తయ్యింది. రాబోయే రోజుల్లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి.