యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ” విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో “లవ్ స్టోరీ” ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా చై కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించాడు. “సెప్టెంబర్ 13 న…
సమంత, నాగచైతన్య వివాహబంధం తెగిపోయినట్లేనా!? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేసిన వార్త సమంత డైవోర్స్. అయితే దీని గురించి అటు సమంత కానీ, ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ ఎక్కడా స్పందించలేదు. సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను ఎండగట్టే ప్రయత్నం చేసింది. తమిళంలో చేస్తున్న సినిమా తప్ప వేరే ఏ కొత్త సినిమా కమిట్ అవలేదు సమంత. అంతే కాదు వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తోంది.…
అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్యల క్రేజీ మల్టీస్టారర్ “బంగార్రాజు” షూటింగ్ ఆగస్టు 20న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. తాజా అప్డేట్ ఏమిటంటే చిత్ర బృందం మేజర్ సెకండ్ షెడ్యూల్ కోసం కర్ణాటకలోని మైసూర్లో అడుగు పెట్టింది. నాగ్, చై ఇద్దరిపై ఈ షెడ్యూల్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. Read Also : సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్ “బంగార్రాజు”లో తన కుమారుడు…
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తయిపోయింది. దాంతో ఆమెకు కాస్తంత సమయం చిక్కినట్టుగా ఉంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ పై సమ్ము దృష్టి పెట్టింది. ఆ మధ్య సమంత సోషల్ మీడియా అకౌంట్స్ లోని తన పేరులోంచి అక్కినేని అనే పదాన్ని తొలగించింది. దాంతో నెటిజన్లతో పాటు కొన్ని సోషల్ మీడియా సైట్స్ సైతం సమంత, నాగ చైతన్య మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయేమో అనే సందేహాలను…
గత కొన్ని రోజులుగా అక్కినేని కోడలు సమంత, నాగచైతన్య మధ్య మనస్పర్ధలు, త్వరలోనే విడిపోతున్నారంటూ ప్రచారం అవుతోంది. ఈ రూమర్స్ కు అటు అక్కినేని ఫ్యామిలీ గాని, ఇటు సమంత గానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇటీవల కాలంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈ విషయంపై స్పందించడానికి ఏమాత్రం సిద్ధంగా లేనని, తనకు నచ్చినప్పుడే చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతానని తేల్చి చెప్పేసింది. ఈ విషయంపై టాలీవుడ్ లో ఇప్పుడు చర్చ నడుస్తోంది.…
తెలుగు చిత్రపరిశ్రమ అంటేనే సెంటిమెంట్స్ కి నిలయం. ఇక ఇక్కడ విఘ్నాలు తొలిగించే వినాకుడికి మొక్కకుండా ఎవరూ ముందడుగు వేయరు. అలాంటిది విఘ్నేశ్వరుడుకి సంబంధించి మిస్టేక్ చేస్తే విఘ్నం ఏర్పడకుండా ఉంటుందా!? అదే జరిగింది ‘లవ్ స్టోరీ’ సినిమా విషయంలో. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేకర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించాయి. కోవిడ్ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయక చవితి కానుకా సెప్టెంబర్ 10న…
కింగ్ నాగార్జున ఆగస్టు 29న తన 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు సోషల్ మీడియా “హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు నాడు ఆయన నెక్స్ట్ సినిమాలు “ది ఘోస్ట్”, “బంగార్రాజు” ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఆయన…
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కోడలు సమంత ఆయనకు బెస్ట్ విషెస్ అందించింది. “మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు మామ” అటూ సామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ అక్కినేని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నాగ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సామ్…
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ “బంగార్రాజు” చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనయుడు అక్కినేని నాగ చైతన్య ఈ పోస్టర్ ను లాంచ్ చేశారు. పోస్టర్ లో నాగార్జున గతంలో నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రంలోని “బంగార్రాజు” పాత్రల్లో కనిపిస్తుండగా మనసును దోచేందుకు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి ఈ లుక్ ను చూసిన అక్కినేని అభిమానుల్లో…
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఖచ్చితంగా విడుదలవుతుందని భావించారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే నాని నటించిన ‘టక్ జగదీష్’ అదే రోజున ఓటీటీలో విడుదల కానుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు, సినిమా థియేటర్లలో…