నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఖచ్చితంగా విడుదలవుతుందని భావించారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే నాని నటించిన ‘టక్ జగదీష్’ అదే రోజున ఓటీటీలో విడుదల కానుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు, సినిమా థియేటర్లలో ఆక్చుపెన్సీ కారణాలతో మరోసారి వాయిదా వేశారు దర్శకనిర్మాతలు.
Read Also: విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ కపుల్?
తెలంగాణా ఎగ్జిబిటర్స్ అందరూ లవ్ స్టోరీ విడుదలకు అనువుగా నాని ‘టక్ జగదీష్’ విడుదలను వాయిదా వేయాలని విలేకరుల సమావేశంలో బహిరంగంగా కోరారు కూడా. అయినా నాని అండ్ కో ససేమిరా అంటూ 10నే విడుదలకు సిద్ధమైంది. దీంతో చేసేదేమీ లేక ‘లవ్ స్టోరీ’ యూనిట్ సెప్టెంబర్ 23న కానీ 30న విడుదల చేయాలని భావిస్తోంది. రెహమాన్ శిష్యుడు పవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. విడుదలైన ‘సారంగ దరియా, ఏవో ఏవో కలలే, ఏ పిల్లా, నీ చిత్రం చూసి’ పాటలు సూపర్ హిట్ అయి సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. మరి ఈ సారైనా సినిమాను చెప్పిన తేదీన విడుదల చేస్తారో? లేదో? చూడాలి.