తెలుగు చిత్రపరిశ్రమ అంటేనే సెంటిమెంట్స్ కి నిలయం. ఇక ఇక్కడ విఘ్నాలు తొలిగించే వినాకుడికి మొక్కకుండా ఎవరూ ముందడుగు వేయరు. అలాంటిది విఘ్నేశ్వరుడుకి సంబంధించి మిస్టేక్ చేస్తే విఘ్నం ఏర్పడకుండా ఉంటుందా!? అదే జరిగింది ‘లవ్ స్టోరీ’ సినిమా విషయంలో. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేకర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించాయి. కోవిడ్ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయక చవితి కానుకా సెప్టెంబర్ 10న విడుదల చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. అయితే హఠాత్తుగా నాని ‘టక్ జగదీష్’ రంగంలోకి దిగటంతో ముందు వారిని వాయిదా వేసుకోమని కోరినా వినక పోవడంతో హఠాత్తుగా ఎలాంటి సమాచారం లేకుండా తమ సినిమానే విడుదల వాయిదా వేసేశారు.
అయితే ఇలా ‘లవ్ స్టోరీ’ వాయిదా పడటం వెనుక ఓ బలమైన రీజన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే వినాయక చవితి కానుకగా తాము సెప్టెంబర్ 10న సినిమా విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ లో వినాయక చవితి స్పెల్లింగ్ తప్పుగా ప్రచురించారు. స్పెల్లింగ్‌లో ‘Vinayaka’కు బదులుగా ‘Vinakaya’ అని వేశారు. ఆ తర్వాత ఆ పోస్టర్స్ వెనక్కి తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విఘ్నాలు తొలిగించే విఘ్నేశ్వరుని పేరునే తప్పుగా ప్రచురించవల్లే ‘లవ్ స్టోరీ’కి పండగ సందర్భంగా ప్రతికూల పరిస్థితి ఎదురయిందనే వాదన వినిపిస్తోంది. అంతర్గతంగా ఏమి జరిగిందన్నది బయటపడకున్నా… సినిమా వాయిదా పడటానికి ఆ స్పెల్లింగ్ మిస్టేక్‌కి కారణమంటున్నారు. మరి ఈ అశుభం ను అధిగమించి నాగచైతన్య, శేఖర్ కమ్ముల, సునీల్ నారంగ్ ‘లవ్ స్టోరీ’ని మంచి తేదీన థియేటర్లలో విడుదల చేసి సక్సెస్ ని అందుకోవాలని భావిద్దాం