టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ “బంగార్రాజు” చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనయుడు అక్కినేని నాగ చైతన్య ఈ పోస్టర్ ను లాంచ్ చేశారు. పోస్టర్ లో నాగార్జున గతంలో నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రంలోని “బంగార్రాజు” పాత్రల్లో కనిపిస్తుండగా మనసును దోచేందుకు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి ఈ లుక్ ను చూసిన అక్కినేని అభిమానుల్లో జోష్ పెరిగింది.
Rea Also : “ఘోస్ట్”గా మారిన నాగార్జున
“వైల్డ్ డాగ్”లో చివరిసారిగా కనిపించిన నాగార్జున “బంగార్రాజు”లో తన కుమారుడు నాగ చైతన్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. “మనం” తర్వాత తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్ పై కన్పించడం ఇది రెండోసారి. ఆగస్టు 20న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. 2016లో నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకి “బంగార్రాజు” ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇందులో రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ప్రీక్వెల్ “బంగార్రాజు”లో నాగ చైతన్య ప్రేయసిగా కృతి శెట్టి నటించనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించనున్నారు.