కాస్తంత సమయం చిక్కితే చాలు మన స్టార్ హీరోస్ ఫ్యామిలీతో కలిసి జాలీ ట్రిప్స్ కు వెళ్ళిపోతుంటారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ అదే పనిలో ఉన్నారు. ఎవరికీ అందనంత దూరంగా తన భార్య, పిల్లలతో కలిసి ఓ హాలిడే ట్రిప్ ను ఎన్టీయార్ ఎంజాయ్ చేస్తున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ ముందు, తర్వాత దాని ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీయార్ ఆ తర్వాత మొదలు కావాల్సిన సినిమా కథలను, ఫైనల్ స్క్రిప్ట్ రీడింగ్…
“మీ పేరు?” “బొబ్బిలిపులి” “అసలు పేరు?” “బొబ్బిలిపులి” – కోర్టు హాల్ లో శ్రీదేవి ప్రశ్న, యన్టీఆర్ సమాధానం… ఇలా సాగుతున్న సీన్ లో ఏముందో, ఆమె ఏమి అడుగుతోందో, ఆయన ఏం చెబుతున్నారో తెలియకుండా ‘బొబ్బిలిపులి’ ఆడే థియేటర్లలో ఆ డైలాగ్స్ కు కేకలు మారుమోగి పోయేవి. అసలు యన్టీఆర్ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చే టప్పటి నుంచీ ఆయన నోట వెలువడిన ప్రతీ డైలాగ్ కు జనం చప్పట్లు, కేరింతలు, ఈలలు సాగుతూనే ఉన్నాయి. దాదాపు…
ఇప్పటి వరకు నందమూరి హీరోలు కలిసి నటించిన సందర్భాలు లేవు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం.. తన బింబిసార మూవీ సీక్వెల్స్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించబోతున్నానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అసలు బింబిసారలో ఏ పార్ట్‌లో ఎన్టీఆర్ నటించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అందుకే బింబిసార అనే సాలిడ్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆగస్టు 5న విడుదలకు…
కథలు కొత్తవి కనిపించక పోతే, పాత కథలనే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అలా తెలుగు చిత్రసీమలో పలు పాత కథలే కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాయి. వాటిలో కొన్ని ఘనవిజయాలు సైతం సాధించాయి. తన చిత్రాలనే మళ్ళీ కాలానుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి ప్రేక్షకులను రంజింప చేశారు దిగ్దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య. 1934లో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ తెలుగు చిత్రసీమలో తొలి బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమానే మరో…
తెలుగు చిత్రసీమలో వెలుగు చూసిన మల్టీస్టారర్స్ లో విజయావారి ‘గుండమ్మ కథ’ ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు విశేషాలకు నెలవుగా ‘గుండమ్మ కథ’ నిలచింది. పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన సాంఘిక చిత్రాలు కొన్నే. వాటిలో ఘనవిజయం సాధించిన ఏకైక చిత్రం ‘గుండమ్మ కథ’. మహానటుడు యన్టీఆర్ నూరవ చిత్రంగా తెరకెక్కిన సినిమా కూడా ఇదే! ఈ చిత్రం తమిళ వర్షన్ ‘మనిదన్ మారవిల్లై’ మరో మహానటుడు ఏయన్నార్ కు వందో సినిమా…
తెలుగు చిత్రసీమలో పలు రికార్డులకు నెలవుగా నిలిచారు నటరత్న నందమూరి తారక రామారావు. ఆయన జన్మదినోత్సవ కానుకలుగా అనేక చిత్రాలు విడుదలై విజయం సాధించాయి. తెలుగునాట స్టార్ హీరోస్ బర్త్ డేస్ కు విడుదలైన చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది యన్టీఆర్ కెరీర్ లోనే అధికంగా చూస్తాం. యన్టీఆర్ బర్త్ డేకు విడుదలై విజయం సాధించిన అన్ని చిత్రాల్లోకి అనూహ్య విజయం సాధించిన చిత్రంగా ‘జస్టిస్ చౌదరి’ నిలచింది. ఈ సినిమా 1982 మే 28న యన్టీఆర్…
“వింటే భారతం వినాలి… తింటే గారెలే తినాలి…” అని నానుడి. రామాయణ, భారత, భాగవతాలు మన భారతీయులకు పవిత్రగ్రంథాలు. ఈ పురాణగాథల ఆధారంగానే భారతీయ సినిమా, తెలుగు సినిమా ప్రాణం పోసుకోవడం విశేషం! తరువాతి రోజుల్లో భారతీయ పురాణగాథలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు నటించిన పౌరాణిక చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. తెలుగులో రూపొందిన యన్టీఆర్ పౌరాణికాలు ఇతర భాషల్లోకి అనువాదమై అలరించాయి. భారతగాథకు అసలైన నాయకుడు అనిపించే భీష్ముని గాథతో…