కాస్తంత సమయం చిక్కితే చాలు మన స్టార్ హీరోస్ ఫ్యామిలీతో కలిసి జాలీ ట్రిప్స్ కు వెళ్ళిపోతుంటారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ అదే పనిలో ఉన్నారు. ఎవరికీ అందనంత దూరంగా తన భార్య, పిల్లలతో కలిసి ఓ హాలిడే ట్రిప్ ను ఎన్టీయార్ ఎంజాయ్ చేస్తున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ ముందు, తర్వాత దాని ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీయార్ ఆ తర్వాత మొదలు కావాల్సిన సినిమా కథలను, ఫైనల్ స్క్రిప్ట్ రీడింగ్ తోనూ మొన్నటి వరకూ బిజీగా ఉన్నట్టు తెలిసింది. అలానే తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసార’ మూవీ ఈ నెల 5న విడుదల కాబోతున్న సందర్భంగా జరిగిన ప్రమోషన్ ఫంక్షన్ లో ఎన్టీయార్ పాల్గొన్నారు. ఆగస్ట్ 1 నుండి సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో ఎన్టీయార్ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కూడా మరికాస్తంత సమయం పట్టేట్టుగా ఉంది. ఈలోగా కొంత సమయం ఫ్యామిలీ మెంబర్స్ కు కేటాయిద్దామని ఎన్టీయార్ భావించినట్టుగా ఉంది. అందుకే.. తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎన్టీయార్ అలా ఓ మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయి… ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేస్తున్నారు. విశేషం ఏమంటే… తామిద్దరూ అలా నాలుగు మాటలు… కప్పు కాఫీ తాగుతున్న ఫోటోను ఎన్టీయార్ సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ తో దాన్ని వైరల్ చేస్తున్నారు.