(అక్టోబర్ 5తో ‘శ్రీగౌరీ మహాత్మ్యం’కు 65 ఏళ్ళు) ‘శ్రీ గౌరీ మహాత్మ్యం’ చిత్రానికి ‘మంగళగౌరీ వ్రతకథ’ అనే ఉప శిర్షీక కూడా ఉంటుంది. నటరత్న యన్.టి.రామారావు కథానాయకునిగా మహీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. డి.యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పి.ఎస్.శేషాచలం నిర్మించారు. భక్తి రసం తోడయిన జానపద కథ ఇది. భక్తజనాన్ని భలేగా ఆకట్టుకుంది. 1956 అక్టోబర్ 5న ‘శ్రీ గౌరీ మహాత్మ్యం’ జనం ముందు నిలచింది. వారి మనసులు గెలిచింది. 1956లో…
(సెప్టెంబర్ 29న యన్టీఆర్ ‘అడుగుజాడలు’కు 55 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్, నటచక్రవర్తి యస్వీఆర్ డాక్టర్లుగా నటించిన చిత్రం ‘అడుగుజాడలు’. తాపీ చాణక్య దర్శకత్వంలో నవజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.సాంబశివరావు, జి.వందనం ‘అడుగుజాడలు’ నిర్మించారు. ఈ చిత్రంలో జమున నాయికగా నటించారు. 1966 సెప్టెంబర్ 29న ఈ సినిమా విడులయింది. ‘అడుగుజాడలు’ కథ విషయానికి వస్తే- డాక్టర్ కృష్ణ ఎంతో మేధావి. తన వైద్యంతోనూ, మంచితనంతోనూ దుర్మార్గులను సైతం సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. పోలియోకు అప్పట్లో తగిన వైద్యం…
(సెప్టెంబర్ 8న కలసివుంటే కలదు సుఖంకు 60 ఏళ్ళు పూర్తి) ఆ రోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఓ కుటుంబంలా ఉండేవారు. నిర్మాతను తల్లిగా, దర్శకుడిని తండ్రిగా భావించేవారు. హీరో పెద్దకొడుకుగా బాధ్యతలు స్వీకరించేవారు. ఇలాంటి నీతినియమాలు అన్నవి సినిమా పుట్టిన దగ్గర నుంచీ అంతటా ఉన్నవే. అవి మన దేశంలోనూ సినిమా రంగం స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో పరిఢవిల్లాయి. ఆ నాటి మేటి నటులు ఇవే నియమాలను తు.చ.తప్పక పాటించేవారు. మహానటుడు యన్.టి.రామారావు మరింతగా…
(ఆగస్టు 25తో ‘బంగారు మనిషి’కి 45 ఏళ్ళు పూర్తి) నటరత్న యన్.టి.రామారావు నటించిన ‘బంగారు మనిషి’ మంచి కథ, కథనంతో జనాన్ని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని త్రివేణి ప్రొడక్షన్స్ పతాకంపై పి. పేర్రాజు నిర్మించారు. అంతకు ముందు యన్టీఆర్ తో ‘బడిపంతులు’ వంటి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించి విజయం సాధించిన పేర్రాజు, ఈ సినిమాలోనూ తన అభిరుచిని చాటుకున్నారు. ‘బంగారు మనిషి’ చిత్రానికి త్రివేణి ప్రొడక్షన్స్ యూనిట్ కథను సమకూర్చడం విశేషం. ఈ చిత్రానికి ప్రముఖ…
(జూలై 25న యన్టీఆర్ ‘విశ్వరూపం’కు 40 ఏళ్ళు) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో రూపొందిన ఐదు చిత్రాలు అలరించాయి. వాటిలో నాల్గవ చిత్రం ‘విశ్వరూపం’. అంతకు ముందు యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు” అన్నిటా నందమూరి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ‘విశ్వరూపం’లో కూడా యన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య…
సంగీత, నృత్యాలు ఇరుసులుగా కథారధం నడిచిన చిత్రం ‘సంగీత లక్ష్మి’. ఎన్టీఆర్, జమున జంటగా నటించిన ఈ సినిమా జూలై 7, 1966లో విడుదలైంది. అంటే నేటితో యాభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ తన చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్లుగా పనిచేసిన పలువురిని నిర్మాతలుగా మార్చారు. ఈ సినిమాకూ అలానే అమరా రామ సుబ్బారావు అనే ప్రొడక్షన్ మేనేజర్ ను నిర్మాతను చేశారు. పి. నరసింగరావుతో కలిసి అమరా రామ సుబ్బారావు ‘సంగీత లక్ష్మి’ చిత్రం నిర్మించారు.…
దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించే బాధ్యతను చేపట్టింది. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లును ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలోని టెక్కలి, కుప్పం, పాలకొల్లు, రేపల్లె పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఏర్పాటుచేసిన కాల్…
యన్.టి.ఆర్. అన్న మూడక్షరాలు వినగానే తెలుగువారి మది పులకించిపోతుంది. రామారావుకు సంబంధించిన అనేక అంశాలు తెలుగువారికి పరమానందం పంచాయి. నిజజీవితంలో తారకరామ నామధేయుడు – తెరపై శ్రీరామునిగా మెప్పించిన నటధీరుడు. మన పురాణపురుషుల పాత్రలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియవు. రవివర్మ చిత్రాల ద్వారా తెలుసుకోగలిగాం. ఆ చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా నందమూరి నటన సాగింది. శ్రీరాముడు అంటే యన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం మదిలో నిలిచారు. రామ పాత్రలో రామారావు అభినయం…
తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి మే 28న. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన నటవారసుడు నందమూరి బాలకృష్ణ తన గానంతో ఓ నివాళి సమర్పిస్తున్నారు. శ్రీరాముని పాత్రలో యన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. “సంపూర్ణ రామాయణం, లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” చిత్రాలలోనూ “చరణదాసి, సి.ఐ.డి. చిట్టిచెల్లెలు, అడవిరాముడు” వంటి సాంఘికాలలోనూ శ్రీరాముని పాత్రలో కనిపించి అలరించారు యన్టీఆర్. తెలుగువారి…