మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎల్లుండి (శనివారం) ఏలూరులో జరిగే సిద్దం సభకు నియోజక వర్గం నుంచి కార్యకర్తలు, నేతలను పంపే పనికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో.. మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని మైలవరం పరిశీలకులు పడమట సురేష్ బాబు సమావేశమయ్యారు. కాగా.. ఎమ్మెల్యే వసంత హైదరాబాద్ లో ఉన్నారు. సిద్ధం కార్యక్రమానికి అందుబాటులో ఉండనని వసంత కృష్ణ పార్టీ పెద్దలకు ఇప్పటికే…
కృష్ణా జిల్లాలో కాక రేపుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.. మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్లా తెలుగుదేశం పార్టీ సర్వేలు చేపట్టింది.. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు ఎమ్మెల్యే వసంత.. ఇప్పుడున్న సమకాలీన పరిస్ధితుల్లో ప్రజా ప్రతినిధులుగా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నాం అన్నారు.. ఈ కాలంలో పని చేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా అదృష్టవంతులం, ఒక రకంగా దురదృష్టవంతులం.. అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్యగా ఉంది.. ప్రజలు అనుకున్న రీతిలో నిధులు కేటాయించలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్.
మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో నుంచి కాల్ వచ్చిందట.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం కాబోతున్నారట.. ఇప్పటికే తాను పోటీ చేయను అంటూ అధిష్టానం పెద్దలకు వసంత చెప్పినట్టు సమాచారం అందుతుండగా.. ఇప్పటికే పలుమార్లు వసంతను సీఎంవోకి రావాలని పిలిచినా వెళ్లని ఆయన.. ఈ రోజు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
Vasantha Venkata Krishna Prasad: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సెటైర్లు పేల్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీమంత్రి దేవినేని ఉమపై విమర్శలు గుప్పించారు.. మైలవరం జిలేబీ దేవినేని ఉమ, ఇతను చేసేవన్నీ జిలేబీ పనులేనంటూ ఎద్దేవా చేశారు.. జీవన్మృతుడు దేవినేని ఉమ అంటూ మండిపడ్డ ఆయన.. గతంలో నేను ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని…