జోగి రమేష్ చేసిన ఆరోపణలకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అసెంబ్లీ సమావేశాలలో NTPSలో బూడిద సమస్య గురించి నేను ప్రశ్న అడిగాను.. సోమవారం ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు.. అయితే, జోగి రమేష్ దురదృష్ట వశాత్తూ రెండు సార్లు గెలిచారు.. NTPS బూడిద కాంట్రాక్టర్ తో కుమ్మక్కై జోగి ఇలా మాటాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు..
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈ డబుల్ మర్డర్స్ ఘటన జరిగింది. శరణ్య, లీలా సాయి అనే ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు తండ్రి రవిశంకర్. అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నట్లు లేఖ రాసి పారిపోయాడు. దాదాపు 10 రోజులపాటు రవిశంకర్ జాడ తెలియలేదు.
ఆస్తి విషయంలో తండ్రి శ్రీనివాసరావుతో గొడవ పెట్టుకున్న కొడుకు పుల్లారావు కొట్టి చంపాడని పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడని ఏసీపీ ప్రసాద్ రావు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని పుల్లారావు అప్పులపాలైయ్యాడని, ఆ అప్పులు తీర్చడానికి తండ్రి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఈ కేసును తప్పు దోవ పట్టించేందుకు పుల్లారావు పక్క పొలం చల్లా సుబ్బారావుతో గతంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడని…
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా వలసలు జరుగుతున్నాయి. టికెట్ దక్కనివారు పక్క పార్టీల వైపు చుస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ తీర్థం పచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వసంతతో పాటు మైలవరానికి చెందిన చాలామంది టీడీపీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. ఇంతలో టీడీపీలోకి…