Tirupati Rao Yadav: మైలవరం పంచాయితీకి ముగింపు పలికారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించారు. మంత్రి జోగి రమేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య ఆధిపత్య పోరుతో.. ప్రత్యామ్నాయాన్ని వెతికారు.. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్టు.. సంకేతాలు ఇచ్చారు.. టీడీపీ, జనసేన నేతలను తనను ఆహ్వానిస్తున్నట్టు చెప్పుకొచ్చిన విషయం విదితమే.. మైలవరం వైసీపీ ఇంఛార్జ్‌గా నియమితులైన సర్నాల తిరుపతి రావు యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్, మంత్రి జోగి రమేష్ లకు ధన్యవాదాలు అన్నారు. మేం వైఎస్ జగన్ ను చూసే వచ్చి వైసీపీకి తిరిగాం.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేం వైసీపీకి పని చేశాం అన్నారు. ఇక, రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ గెలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సర్నాల తిరుపతిరావు యాదవ్.
Read Also: Jharkhand: రాహుల్‌తో కల్పనా సోరెన్ భేటీ.. ఏం చర్చించారంటే..!
ఇక, మైలవరం వైసీపీ పరిశీలకుడు పటమట సురేష్ బాబు మాట్లాడుతూ.. వసంత కృష్ణప్రసాద్ కు చాలా గౌరవం ఇచ్చాం.. వసంతకు ఉన్న సమస్యలు పరిష్కరించడానికి చాలా కృషి చేశాం.. కానీ, పార్టీ వదిలి వెళ్లాలనే వసంత అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనకు రావాల్సినవి అన్ని వచ్చాక ఇప్పుడు అభాండాలు వేయకూడదు.. నియోజకవర్గంలో ఏదైనా జరిగితే ఎమ్మెల్యేకి తెలియకుండా జరగదు.. మంత్రి జోగి రమేష్ కు ఆయనకు ఉన్న విభేదాలకు అడ్డుకట్ట వేసింది పార్టీయే అన్నారు. ఏ ఎమ్మెల్యేకు లేనంత గౌరవం పార్టీ వసంతకు ఇచ్చింది.. వసంత మాటలు మాకు చాలా బాధ కలిగించాయి.. వసంత మాత్రమే కాదు.. ఏపీ మొత్తం అప్పులపాలై ఉంది.. చంద్రబాబు పెండింగ్ పెట్టిన బిల్లులు చెల్లిస్తూ వచ్చాం అన్నారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం అవ్వడం కారణంగా చూపడం వసంత కృష్ణప్రసాద్ కు సరైనది కాదు.. పెత్తందారులకు కాదు.. సామాన్యుడికే అవకాశం మా పార్టీలో.. ఒక సామాన్య జడ్పీటీసీకి అవకాశం ఇచ్చారు సీఎం జగన్.. మైలవరంలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పటమట సురేష్ బాబు.