బాలీవుడ్ జంట అలియా భట్, రణబీర్ కపూర్‌లు త్వరలో ముంబైలోని తమ కొత్త బంగ్లాలోకి మారనున్నారు. రణబీర్ తాత రాజ్ కపూర్ కు చెందిన కృష్ణ రాజ్ ప్రాపర్టీలో నిర్మించిన ఈ ఆరు అంతస్తుల భవనానికి ‘కృష్ణ రాజ్’ అని పేరు పెట్టారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే రణబీర్ కూతురు రాహాతో కలిసి గృహప్రవేశం చేయాలని కుటుంబం భావిస్తోంది. అయితే, ఈ ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:Bigg Boss: బిగ్ బాస్-9లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ?.. జైలు శిక్ష, డాక్టర్‌తో పెళ్లి, ఇద్దరు పిల్లలు!
తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అలియా ఈ ఘటనను ఖండించారు. ఇది తమ గోప్యతను ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. “ముంబై లాంటి నగరంలో స్థలం తక్కువగా ఉంటుందని నాకు తెలుసు. కొన్నిసార్లు మన కిటికీ నుండి చూస్తే పక్కవారి ఇల్లు కనిపిస్తుంది. కానీ, దానివల్ల ఇతరుల ప్రైవేట్ ప్రాపర్టీ అయిన ఇళ్లను చిత్రీకరించి, ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టే హక్కు ఎవరికీ లేదు. నిర్మాణంలో ఉన్న మా ఇంటి వీడియోను మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా పలు ప్రచురణ సంస్థలు రికార్డు చేసి, ప్రచారం చేశాయి” అని ఆమె రాసుకొచ్చారు. అలియా భట్ ఈ ఘటనపై గట్టిగా స్పందించడంతో సెలబ్రిటీల గోప్యత హక్కుపై మరోసారి చర్చ మొదలైంది.