Irani Cup 2024: ముంబై ‘రన్ మెషిన్’గా పేరొందిన సర్ఫరాజ్ ఖాన్ లక్నోలోని ఎకానా స్టేడియంలో రెస్ట్ ఆఫ్ ఇండియాపై అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆరో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ 149 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచరిలో 14 ఫోర్లు కొట్టి అజేయంగా నిలిచాడు. ఇది అతనికి 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. ఫస్ట్‌క్లాస్‌లో ఇప్పటివరకు 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. 26 ఏళ్ల సర్ఫరాజ్ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టులో భాగమైనప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.
Nabard 2024: 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు.. నాబార్డ్‌లో ఉద్యోగాలు..
ఈరోజు ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 149 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ సమయంలో తన జట్టును కష్టాల నుండి గట్టెక్కించి బలమైన స్థితిలోకి తీసుకువచ్చాడు. ముంబై కెప్టెన్ అజింక్య రహానే సెంచరీ పూర్తి చేయడంలో విఫలమై 97 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Flipkart Offers: రూ.1కే ఆటో రైడ్.. ఎగబడుతున్న జనం!
ఇకపోతే అక్టోబర్ లోనే భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సర్ఫరాజ్ ఎంపిక దాదాపు ఖరారైంది. అయితే అక్కడ కూడా అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. నిజానికి కేఎల్ రాహుల్‌పై కెప్టెన్ రోహిత్ శర్మకు ఎక్కువ నమ్మకం ఉంది. రాహుల్ తన బ్యాట్‌తో అద్భుతంగా ఏమీ చేయలేకపోతున్నాడన్నది వేరే విషయం. అయితే ఇదిలావుండగా, కెఎల్ రాహుల్ నిరంతరం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడుతున్నాడు. మరి టీమిండియాను ఎంపిక చేసే విషయంలో సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
THAT moment when Sarfaraz Khan brought up his 💯👏
A brilliant knock so far 🙌#IraniCup | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/nEEJW2kea9
— BCCI Domestic (@BCCIdomestic) October 2, 2024