ముంబై ఆస్పత్రిలో ఓ కార్మికుడు నీచానికి పాల్పడ్డాడు. మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా కిటికీలోంచి మొబైల్ ద్వారా రికార్డ్ చేశాడు. గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో బండారం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జయేష్ సోలంకిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Maharashtra Assembly Elections: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గట్టి షాక్ ఇచ్చింది. త్వరలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవి పునరాభివృద్ధి ఇప్పుడు ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, కొత్తగా ఏర్పడిన ధారవి, దాని పరిసరాల నివాసితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న సర్వేకు తన మద్దతును అందించింది.
Jewelry Shop Robbery In Mumbai Viral video: మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి అచ్చం సినిమా తరహాలో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఏకంగా రూ. 11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ముంబైలోని ఖర్ఘర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులు నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారని…
భారతదేశం-మాల్దీవుల మధ్య సంబంధాలలో హెచ్చు తగ్గుల నేపథ్యంలో.. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ నేటి నుంచి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ సమయంలో.. అతను భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగానే కుండపోత వర్షం కురిసింది. గురువారం కురిసిన కుండపోత వర్షానికి ముంబై, పూణె నగరాలు జలమయం అయ్యాయి.
Duplicate Medicines Making: ముంబై నగరంలో ఆయుర్వేదం పేరుతో భారీగా నకిలీ మందులను తయారు చేస్తున్న ఘర్వార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పై తాజాగా ఎఫ్‌డిఎ దాడులు చేసింది. ఈ దాడిలో ఎఫ్‌డీఏ ఏకంగా రూ.1 కోటి 27 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. దాదాపు రూ.2 కోట్ల 93 లక్షల విలువ కలిగిన 255 మందుల తయారీ యంత్రాలను కూడా సీజ్ చేశారు. స్ట్రీట్ నంబర్ 20, శైలేష్ ఇండస్ట్రీ, గీతా…
ముంబైలో వర్షం కురుస్తోంది. అక్కడి రోడ్లు, వీధులు, చౌరస్తాలన్నీ నీట మునిగాయి. అరేబియా సముద్రం ఉప్పొంగుతోంది. నీటి ప్రవాహం కారణంగా.. ముంబై హార్ట్‌లైన్ అంటే లోకల్ రైళ్లు ఆగిపోయాయి.
Atal Setu Bridge: ముంబైలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అటల్ సేతు వంతెన సూసైడ్ స్పాట్‌గా మారుతోంది. తాజాగా 38 ఏళ్ల ఇంజనీర్ బుధవారం మధ్యాహ్నం అటల్ సేతుపై తన వాహనాన్ని ఆపి, అక్కడ నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.