Pradeep Sharma: 2006లో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ సన్నిహితుడు రామ్‌నారాయణ్ గుప్తా బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో మాజీ పోలీసు ప్రదీప్ శర్మను దోషిగా నిర్ధారించి బాంబే హైకోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జస్టిస్ రేవతి మోహితేదేరే, గౌరీగాడ్సేలతో కూడిన డివిజన్ బెంజ్ ‘ఫేక్ ఎన్‌కౌంటర్’ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు 2013లో ప్రదీప్ శర్మ నిర్దోషి అని చెప్పిన తీర్పును హైకోర్ట్ తప్పుపట్టింది.
ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవను కనుగొన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. వారంతా తమిళనాడులోని కన్యాకుమారి వాసులని పోలీసులు తెలిపారు.
Bomb Scare in Mumbai amid 2024 New Year Celebrations: ముంబై నగరంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ నగరంలోని పలు చోట్ల బాంబులు పేలుతాయని ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేశాడు. దాంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై అంతా విస్తృతంగా గాలింపు చేపట్టినా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ప్రస్తుతం ముంబై నగరం మొత్తం హై అలర్ట్‌లో ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఎదురు…
Thane: మనిషికి ఎప్పుడైతే డబ్బు, అధికారం అనే మత్తు ఆవహిస్తుందో.. అప్పుడు తనలోని జంతువు మేల్కొంటుంది. దీనికి సజీవ ఉదాహరణ మహారాష్ట్రలోని థానేలో కనిపించింది.
Sniffer Dog: ప్రస్తుతం ఆర్మీతో పాటు ఇతర భద్రతా బలగాల్లో జాగిలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారానే చాలా వరకు ఆపరేషన్లను మన భద్రతా బలగాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేటకు స్నిఫర్ డాగ్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ముంబైలో తప్పిపోయిన పిల్లాడిని కేవలం 3 గంటల్లోనే కనుగొంది. "లియో" పేరు కలిగిన స్నిఫర్ డాగ్ అతడిని గుర్తించింది.
Mumbai: స్నేహితుడే కదా అని నమ్మి వచ్చినందుకు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనే కాకుండా అతని స్నేహితుడు కూడా రేప్ చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) క్వార్టర్స్‌లో నివసించే 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.
Mumbai Police Receive Threat Message Ahead Of IND vs NZ Semi Final 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో గెలిచి సత్తాచాటిన టీమిండియా.. సెమీస్‍లోనూ అదే జోరును కొనసాగించాలనే కసితో ఉంది. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై…
మహదేవ్ బెట్టింగ్ యాప్ ఉచ్చులోకి మొదట బాలీవుడ్ సెలబ్రిటీలు, ఆ తర్వాత రాజకీయ నాయకుల పేర్లు వచ్చాయి. కానీ ఈ ఉచ్చు మరింత బిగుస్తుంది. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అనే పేరు నుంచి ఇప్పుడు వ్యాపార ప్రపంచానికి చేరుకుంది. ఆయుర్వేద ఔషధాల తయారీలో (FMCG) రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన డాబర్ గ్రూప్‌లోని ఉన్నతాధికారులు దీని ట్రాప్లో పడిపోయారు. దీంతో వారిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
Mukesh Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి ఇటీవల బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ముకేష్ అంబానీ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ.. ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ కేసును విచారించిని గాందేవి పోలీసులు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నిందితుడిని గణేస్ రమేష్ వనపర్థిగా గుర్తించారు. అతడిని నవంబర్ 8వ తేదీ వరకు పోలీస్…
ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ మరియు డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా అందరికీ సపరచితమే.. హౌస్ లో తన బోల్డ్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది… అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే…