Butter and Ghee Adulteration: వెన్న, నెయ్యి కల్తీ రాకెట్ ముఠాను ఛేదించిన అధికారులు..
- వెన్న
- నెయ్యి కల్తీ రాకెట్‌ను కనుగొన్న అధికారులు
- దక్షిణ ముంబై లోని ఎల్‌టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లో ఘటన.
- 780 లీటర్ల నకిలీ నెయ్యితో పాటు టాప్ బ్రాండ్లుగా ముద్రించిన 425 బస్తాలను పోలీసులు స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై నగరంలోని పోలీసు క్రైమ్ బ్రాంచ్ లో ఉన్న ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెన్న, నెయ్యి కల్తీ రాకెట్‌ను కనుగొన్నారు. ఈ దాడులలో రూ. 1.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. దక్షిణ ముంబై లోని ఎల్‌టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లోని ఒక దుకాణంపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులు ప్రముఖ నెయ్యి బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్టు గుర్తించారు.
Manipur: మణిపూర్ సీఎం నివాసం దగ్గర భారీ అగ్నిప్రమాదం
Also Read
ఇక అధికారుల నివేదికల ప్రకారం.. జోగేశ్వరిలో నివాసం ఉంటున్న చమన్ షాము యాదవ్ (40), ఝమన్ షాము యాదవ్ (55) ఇద్దరినీ పామాయిల్, వనస్పతి, బటర్ కలర్, ఫ్లేవర్ ఏజెంట్లను కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరితోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు కూడా దాడిలో సహాయం చేయడానికి సంఘటనా స్థలంలో ఉన్నారు. ఈ బృందం సైట్ నుండి పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి, సంబంధిత పదార్థాలను స్వాధీనం చేసుకుంది. 780 లీటర్ల నకిలీ నెయ్యితో పాటు టాప్ బ్రాండ్లుగా ముద్రించిన 425 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో స్టీల్ ట్యాంక్, గరాటు, ప్లాస్టిక్ మగ్, కెటిల్, ఫ్లేవర్ బాక్స్, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ప్యాకింగ్ మెషిన్, అమూల్ స్వచ్ఛమైన నెయ్యి ఖాళీ ప్యాకెట్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న సామాగ్రి మొత్తం విలువ ఒక లక్ష ఇరవై వేల పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు.
UPSC Prelims 2024: ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారా.. వీటిని గుర్తుంచుకోండి..
ఈ సందర్భంగా అధికారులు సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఐపిసి, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఎల్‌టి మార్గ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఇక అక్కడ తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు