Mumbai: స్నేహితుడే కదా అని నమ్మి వచ్చినందుకు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనే కాకుండా అతని స్నేహితుడు కూడా రేప్ చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) క్వార్టర్స్‌లో నివసించే 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.
బుధవారం-గురువారం మధ్య రాత్రి చెంబూర్ పోస్టల్ కాలనీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత యువతి తండ్రి బార్క్‌లో పనిచేస్తున్నాడు. అతనికి కేటాయించి క్వార్టర్‌లో యువతి ఉంటుంది. ఉద్యోగ కారణాల రీత్యా ప్రస్తుతం తండ్రి వేరే ఊళ్లో ఉన్నాడు. నిందితుల్లో ఒకరైన 26 ఏళ్ల వ్యక్తి తండ్రి కూడా బార్క్‌లోనే పనిచేస్తున్నాడు. యువతికి, నిందితుడు తెలుసు.
Read Also: Vinod Thomas: ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన మలయాళ నటుడు.. ఏసీనే ప్రాణం తీసిందా?
నిందితుడైన వ్యక్తి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో బుధవారం రాత్రి తన నివాసానికి రావాల్సిందిగా సదరు వ్యక్తి యువతిని కోరాడు. నిందితుడు యువతిని తన ఇంటి నుంచి ఇండక్షన్ కుకింగ్ స్టవ్ తీసుకురావాలని కోరడంతో ఆమె వెళ్లింది. యువతి, సదరు వ్యక్తి, అతని స్నేహితులతో ముచ్చటిస్తూ అక్కడే ఉంది.
దీన్ని అవకాశంగా భావించి నిందితుడు యువతికి కూల్‌డ్రింక్ ఇచ్చాడు. తాగిన తర్వాత యువతి అపస్మారస్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత నిందితుడు, అతని స్నేహితుడు ఇద్దరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తెల్లవారుజామున స్పృహలోకి వచ్చింది. ఆ తర్వాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఇరుగుపొరుగు వారికి, కుటుంబసభ్యులకు తెలియజేసింది. చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులిద్దరిపై అత్యాచారం, సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.