Maharastra : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవ పడి ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తన మూడేళ్ల పాపను గొంతుకోసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య అనంతరం మహిళ తన కుమార్తె మృతదేహంతో దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డుపై తిరుగుతూనే ఉంది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంఐడీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితురాలు 23 ఏళ్ల ట్వింకిల్ రౌత్, ఆమె భర్త రామ్ లక్ష్మణ్ రౌత్ (24) ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం నాగ్‌పూర్‌కు వెళ్లారు. వారు ఒక పేపర్ తయారీ కంపెనీలో పనిచేశారు. ఎంఐడీసీ ప్రాంతంలోని హింగ్నా రోడ్‌లోని కంపెనీ ప్రాంగణంలో ఒక గదిలో నివసిస్తున్నారని ఒక అధికారి తెలిపారు.
Read Also:Bhadradri Kothagudem: విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి..
వీరి మధ్య పరస్పర అపనమ్మకం కారణంగా తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. తీవ్ర వాగ్వాదం మధ్య వారి కుమార్తె ఏడవడం ప్రారంభించింది. దీంతో కోపోద్రిక్తుడైన మహిళ తన కుమార్తెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి చెట్టుకింద గొంతుకోసి హత్య చేసింది. అనంతరం మృతదేహంతో నాలుగు కిలోమీటర్ల మేర నడిచింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని చూసి భద్రతా సిబ్బందికి జరిగిన విషయాన్ని తెలియజేసినట్లు తెలిపారు. పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారని అధికారి తెలిపారు. అనంతరం పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలు మోపారు. అనంతరం మహిళను కోర్టులో హాజరుపరిచామని, అక్కడి నుంచి మే 24 వరకు పోలీసు కస్టడీకి పంపామని అధికారి తెలిపారు.
Read Also:EVM Vandaalism: మాచర్ల సంఘటనపై సీఈసీ సీరియస్.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు