Road Accident: ముంబైలోని ధారవి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న 6 కార్లను వేగంగా వచ్చిన ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనతో వాహనాలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రమాదం శుక్రవారం ఉదయం 6 గంటలకు జరిగింది. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కకు ఆపి వాటి యజమానులు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, తెల్లవారుజామున అదుపుతప్పి వేగంగా…
దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ అట్టహాసంగా కొనసాగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రజలు డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని ముంబై పోలీసులకు శనివారం బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. అజ్మీర్‌కి చెందిన ఓ నెంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ టీంలను పంపామని అధికారి తెలిపారు.
దాదాపు రెండు నెలల క్రితం బాబా సిద్ధిక్‌ను షూటర్లు కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిక్‌ను చంపడానికి ముందు సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. బాబా సిద్ధిక్ హత్యకేసుకు సంబంధించి విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పేర్కొంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తి మహిళగా గుర్తించారు. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా విడిచిపెట్టి వెళ్లిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Baba Siddique Murder: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసును విచారిస్తున్న ముంబై క్రైం బ్రాంచ్‌కు మరో భారీ విజయం లభించింది. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన గుజరాత్‌కు చెందిన ఓ నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ ఆదివారం అరెస్టు చేసింది. ఈ హత్య కేసులో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన సల్మాన్ భాయ్ ఇక్బాల్ భాయ్ వోహ్రాను స్థానిక పోలీసుల సహాయంతో అకోలాలోని…
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే థ్రెట్ సందేశం వచ్చింది. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు.
Salman Khan: మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్దిఖీ హత్య తర్వాత బాలీవుడ్ యాక్టర్ సల్మాన్‌ఖాన్‌కు వరుసగా హత్య బెదిరింపులు వస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఎన్‌సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను కూడా చంపుతాం అంటూ దుండుగులు అందులో వార్నింగ్ ఇచ్చారు.