ప్లేయర్లతో ఓ మీటింగ్ న్ని ముంబై మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి నెహాల్ ఆలస్యంగా రావడం వల్లే.. అందుకే అతనికి ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. జట్టుతో పాటు, నెహాల్ కూడా సరదాగా ఈ శిక్షను అనుభవించాడు. అందుకే నేహాల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాడ్ వేసుకుని నడుస్తున్నది మనకు కనిపిస్తుంది.
ఐపీఎల్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్కి చేరుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ట్రై చేస్తుంది.