ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ , ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో లక్నో జట్టు 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే ఈ చివరి మ్యాచులు కీలకం కానున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
Also Read : Karnataka CM Post: సిద్ధరామయ్య వైపే మొగ్గు.. డీకే శివకుమార్‌ను దెబ్బతీసిన అంశాలు ఇవే..
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనింగ్ జోడీ క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఓపెనర్ దీపక్ హూడా ( 5 ) మూడో ఓవర్ లోని తొలి బంతికి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే మూడో ఓవర్ లోని సెకండ్ బాల్ కి ప్రేరక్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ జాసన్ బెహ్రెండోర్ఫ్ మూడో ఓవర్ వేసి కీలకమైన రెండు వికెట్లు తీసుకున్నాడు.
Also Read : Naresh- Pavitra Lokesh: అబ్బో లైవ్ లోనే.. ముద్దులతో రెచ్చిపోయిన పవిత్ర-నరేష్
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 6 ఓవర్లు ముగిసే సరికి 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 7వ ఓవర్లలో బౌలింగ్ వచ్చిన పీయూష్ చావ్లా క్లింటన్ డి కాక్ వికెట్ తీసుకున్నాడు. 16 పరుగులు చేసిన డికాక్ పెవిలియన్ బాట పట్టారు. దీంతో ప్రస్తుతం క్రీజులో లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా ( 39: 32బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ ), మార్కస్ స్టోయినీస్ ( 26: 18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు ) ఉన్నారు. కాగా కృనాల్ పాండ్యా కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడుతున్నాడు.