ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ , ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో లక్నో జట్టు 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. స్లో వికెట్ అయిన లక్నో పిచ్ పై ముంబై ఇండియన్స్ తో కీలక మ్యాచ్ ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ జట్టులో మార్కస్ స్టోయినిస్ (47 బంతుల్లో 89 నాటౌట్, 4 ఫోర్లు, 8 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (42 బంతుల్లో 49 రిటైర్డ్ హర్ట్, 1 ఫోర్, 1 సిక్స్ ) రాణించారు. ఆఖర్లో స్టోయినిస్ రెచ్చిపోకుంటే లక్నో స్కోరు 150 పరుగులోపే పరిమితమై ఉండేది.
Also Read : Monsoon: ఈ సారి సాధారణం కన్నా తక్కువ వర్షపాతమేనా..? రుతుపవనాలపై “ఎల్ నినో” ఎఫెక్ట్
రెండో ఇన్నింగ్స్ లో మరింత నెమ్మదించే లక్నో పిచ్ పై ముంబైకి ఈ టార్గెట్ ను ఛేదించడం ఈజీ అయితే అంత కాదు. లక్నో ఈ సీజన్ లో ఇక్కడ గుజరాత్, ఆర్సీబీ చేతిలో స్వల్ప లక్ష్యాలను కూడా ఛేదించలేకపోయాయి. మరి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఏం చేస్తుందో.. మనం చూడాలి.. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న నిర్ణయం కరెక్టనని ముంబై బౌలర్లు నిరూపించారు. ఈ సీజన్ లో వరుసగా విఫలమవుతున్న దీపక్ హుడా (5) మూడో ఓవర్ వేసిన జేసన్ బెహ్రాన్‌డార్ప్ బౌలింగ్ లో టిమ్ డేవిడ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
Also Read : West Bengal: బాణాసంచా పేలి ఐదుగురు మృతి.. బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం..
హుడా స్థానంలో వచ్చిన ప్రేరక్ మన్కడ్ కూడా ఎదుర్కున్న తొలి బంతికే ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 15 బంతులు ఆడి రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసిన ఓపెనర్ క్వింటన్ డికాక్ ను పీయూష్ చావ్లా ఏడో ఓవర్లో ఔట్ చేశాడు. 35 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లక్నోను కెప్టెన్ కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ లు ఆదుకున్నారు. ముంబై బౌలర్లు కవ్వించే బంతులు విసిరినా ఈ ఇద్దరూ నిలకడైన బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి 78 పరుగులు చేసిన లక్నో స్కోరు ఆ తర్వాత నెమ్మదించింది. 11 నుంచి 15 ఓవర్ల మధ్యలో 30 పరుగులే చేశారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యం అందించారు.
Also Read : IPL 2023 : 10 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ ఎంతంటే..?
కాలికి గాయంతో నడవడానికి ఇబ్బందిపడ్డ కృనాల్.. రిటైర్డ్ హార్ట్ గా పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (8 నాటౌట్) తో కలిసి స్టోయినిస్ లక్నో ఇన్నింగ్స్ ను నడిపించాడు. జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో ఫస్ట్ బాల్ ను లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత స్టోయినిస్ మరింత చెలరేగాడు. జోర్డాన్ వేసిన ఇదే ఓవర్లో 4, 4, 6, 4తో లక్నో స్కోరును 150 పరుగుల మార్క్ కు చేర్చాడు. ఇక బెహ్రాన్‌డార్ఫ్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు.. ఆకాశ్ మధ్వల్ వేసిన ఆఖరి ఓవర్లో.. 15 పరుగులివ్వడంతో లక్నో 177 పరుగులు చేసింది.