Gujarat Titans Need 219 Runs To Win The Match Against Mumbai Indians: వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతులకు 103) శతక్కొట్టడం వల్లే.. ముంబై అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29), విష్ణు వినోద్ (30) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. తమవంతు సహకారం అందించారు. జీటీ ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. చూడ్డానికి ఇది భారీ లక్ష్యమే అయినా.. జీటీ లాంటి జట్టుకి, అందునా వాంఖడే వంటి స్టేడియంలో ఛేధించడం పెద్ద కష్టమేమీ కాదు. సమిష్టిగా జీటీ బ్యాటర్లు ఆడితే.. ఆ అక్ష్యాన్ని సునాయాసంగా ఛేధించొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే మాత్రం.. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయాలి. బ్యాటర్లన గందరగోళానికి గురి చేస్తూ.. వికెట్లు పడగొట్టాలి. మరి.. ముంబై బౌలర్లు ఆ స్కోరుని డిఫెండ్ చేయగలరా? లేక జీటీ ఆ లక్ష్యాన్ని ఛేధించగలదా?
MI vs GT: ఓవైపు పరుగులు.. మరోవైపు వికెట్లు.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
తొలుత క్రీజులోకి అడుగుపెట్టిన ముంబై ఓపెనర్లు.. తమ జట్టుకి శుభారంభాన్ని అందించారు. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్న ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ.. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడారు. ఎడాపెడా షాట్లతో జీటీ బౌలర్లను ‘లెఫ్ట్ అండ్ రైట్’ వాయించేశారు. వీళ్లిద్దరు పవర్ ప్లే ముగిసేసరికి 61 పరుగులు జోడించారు. కానీ.. ఏడో ఓవర్‌లో ఇద్దరూ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యారు. తొలుత రోహిత్ స్లిప్‌లో క్యాచ్ ఇవ్వగా, ఇషాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే నేహాల్ వధేరా (15) పెవిలియన్ బాట పట్టాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ విష్ణు వినోద్‌తో కలిసి.. అప్పటికే మైదానంలో ఉన్న సూర్యకుమార్ జట్టుని ముందుకు నడిపించాడు. విష్ణు వినోద్ సైతం మెరుపు షాట్లతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సూర్య, వినోద్ కలిసి నాలుగో వికెట్‌కి 65 పరుగులు జోడించారు. టిమ్ డేవిడ్ సైతం అతని వెంటే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన గ్రీన్‌ని పెద్దగా ఆడే అవకాశం దొరకలేదు. అప్పటికే సూర్య ఫుల్ ఫామ్‌లో ఉండటంతో.. గ్రీన్ అతనికే స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు.
Population In Slums: మురికివాడల్లో ఎక్కువ జనాభా నివసించే టాప్-12 దేశాలు
వన్ డౌన్‌లో వచ్చిన సూర్య.. ఒకవైపు వికెట్లు పడుతున్నా లెక్క చేయకుండా తన 360 డిగ్రీ ఆటతో బౌండరీల మోత మోగించేశాడు. సూర్యని ఔట్ చేసేందుకు రకారకాలుగా ఫీల్డింగ్ సెట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అతడు ఫీల్డర్లు లేని చోటుని ఎంపిక చేసుకొని, అక్కడే షాట్లు బాదేశాడు. ఆఫ్ సైడ్‌లో వెనుకవైపు అతను కొట్టిన ఒక సిక్స్ ఏదైతే ఉందో.. అది ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. తొలుత అర్థశతకాన్ని 32 బంతుల్లో పూర్తి చేసిన సూర్య.. ఆ తర్వాతి హాఫ్ సెంచరీని 17 బంతుల్లోనే కంప్లీట్ చేశాడు. దీన్ని బట్టి.. అతడు ఏ రేంజ్‌లో చితక్కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. సూర్యకి ఐపీఎల్‌లో ఇదే మొదటి సెంచరీ. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే.. రషీద్ ఒక్కడే పొదుపుగా వేశాడు. 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు. మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.