IPL Playoffs 2023: ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. దీంతో 16వ సీజన్ విజేత ఎవరో ఈ వారాంతంలో తేలిపోనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఉత్కంఠభరిత పోరాటాల ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ముందుగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండో స్థానంలో నిలిచింది.…
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా సన్ రైజర్స్ తో ముంబై తలపడుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల 200 నష్టానికి పరుగులు.. ముంబయి ఇండియన్స్ ముందు 201 పరుగుల చేయాలి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ తీసుకుంది.
స్లో వికెట్ అయిన లక్నో పిచ్ పై ముంబై ఇండియన్స్ తో కీలక మ్యాచ్ ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనింగ్ జోడీ క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఓపెనర్ దీపక్ హూడా ( 5 ) మూడో ఓవర్ లోని తొలి బంతికి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే మూడో ఓవర్ లోని సెకండ్ బాల్ కి ప్రేరక్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ జాసన్ బెహ్రెండోర్ఫ్ మూడో ఓవర్ వేసి కీలకమైన రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఇవాళ మరో బ్లాక్ బ్లస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ లో లక్నో వేదికగా ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ తాడోపేడో తెల్చుకోవాడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ఇంపార్టెంట్.